శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 09, 2019, 05:41 PM
 

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు ఆరో నెంబరు గేటును ఎత్తారు. కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.