సుందిళ్ల బ్యారేజీ 37 గేట్లు ఎత్తివేత

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 08, 2019, 11:13 AM
 

పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీకి వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు సుందిళ్ల బ్యారేజీ 37 గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలోకి 43,400 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 53,600 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.901 టీఎంసీల నీటిమట్టం ఉంది.