కడప లో ఎర్రచందనం దుంగలు పట్టివేత

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 03, 2019, 12:45 PM
 

 జిల్లాలోని కసలపాడు మండలం ముసలరెడ్డిపల్లి వద్ద నాలుగు చక్రాల ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా... ముసలరెడ్డిపల్లి వద్దకు వచ్చేసరికి ఆటో మొరాయించింది. ఆటో ఎంతకీ స్టార్ట్‌కాకపోవడంతో భయపడిన దుండగులు.. దుంగలతో ఉన్న ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ ప్రదీప్‌ నాయుడు ఘటనా స్థలికి చేరుకుని వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.