ఇజ్రాయెల్ లో వైఎస్ జగన్ న్యూ లుక్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 02, 2019, 04:25 PM
 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గెటప్ ను మార్చివేశారు. తన ట్రేడ్ మార్క్ తెల్లరంగు ఖద్దరు చొక్కా, లేత గోధుమ రంగు ప్యాంట్ తోనే కనిపించినప్పటికీ.. స్టైల్ మార్చేశారు. న్యూ లుక్ తో కనిపించారు. కొత్తగా ఇన్ షర్ట్ వేసుకున్నారు.సాధారణంగా వైఎస్ జగన్ ఇన్ షర్ట్ వేయరు. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన జెరూసలేంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అక్కడి ఓ హోటల్ లో బస చేశారు.


వైఎస్ జగన్ వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న కొందరు అభిమానులు ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమానితో ఫొటో దిగారు వైఎస్ జగన్. ఆ ఫొటో కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయంలో కూడా ఆయన.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుసరించినట్టే కనిపిస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచెకట్టుతో కాకుండా సూటు, బూటు వేసుకునే వారు. నాలుగు రోజుల పాటు వైఎస్ జగన్ జెరూసలేంలో ఉంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఏసుక్రీస్తు జన్మించిన బెత్లెహాంను సందర్శిస్తారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్రానికి చేరుకుంటారు.