శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 02, 2019, 03:39 PM
 

కర్నూలు జిల్లాలో శ్రీశైలం డ్యాంకు వరద కొనసాగుతూనే ఉంది. డ్యాంకు ప్రస్తుతం చేరుతున్న ఇన్ ఫ్లో 1.89,778 లక్షల క్యూసెక్కులు కాగా డ్యాం నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 836.20 అడుగుల నీటి నిల్వకు చేరుకుంది. డ్యామ్ ప్రస్తుత నీటినిల్వ 56.58 టీఎంసీలు కాగా కల్వకుర్తి ఎట్టుపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.