యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. ఆ పార్టీలో ప్రధాని పదవికి పది మంది పోటీ పడగా బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాన్సన్, హంట్లకు 313 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు మద్దతునిచ్చారు. వీరిద్దరిలో ఒకరిని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.66 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు. 50 శాతానికి పైగా ఓట్లు పొందిన నేత ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉండగా జాన్సన్ ఎన్నికయ్యారు.