న్యూఢిల్లి : కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ నివాసంపై ఇన్‌కం టాక్స్ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. హర్యానాలోని హిస్సోర్, ఆదంపూర్, గురుగ్రామ్‌లలో కుల్దీప్ నివాసంపైనా, ఆయనకు చెందిన కార్యాలయాలపైనా ఐటి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.