అధికార పక్షానికి అసహనం పనికిరాదు : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 02:05 PM
 

అధికార పక్షానికి అసహనం పనికిరాదని  తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార పక్షం తీరును చంద్రబాబు ఖండించారు. సీట్లో కూర్చున్న వారిని కూడా సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్షం మనోభావాలను స్పీకర్ అర్థం చేసుకోవాలన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉందన్నారు.