థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న కన్నడ నాట రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠకు తెరతీస్తున్నాయి. కూటమిని కాపాడుకోవడానికి జేడీఎస్ ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతునే ఉంది. అసమ్మతి ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేందుకు సంకీర్ణ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఒక వేళ కుమార స్వామి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చే పక్షంలో కాంగ్రెస్ నుంచి ఒకరు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని మంత్రి డీకే శివకుమార్ చెప్పడం చూస్తుంటే అసమ్మతి నేతల డిమాండ్లకు తలొగ్గినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న సిద్ధరామయ్య పేరును కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నప్పటికీ శివకుమార్‌కే మద్దతు ఇవ్వాలని . జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ భావిస్తున్నట్టు సమాచారం.