అన్న క్యాంటీన్‌ల రంగు మారుతోంది

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 12:39 AM
 

పేదల ఆకలి తీర్చేందుకు గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ అన్న క్యాంటీన్ లను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాల‌ని భావించింది. అయితే వీటి రంగు  పేరు కూడా మార్చేందుకు  వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.   రూ.5కే భోజనం పెట్టి పేదల ఆకలి తీర్చే ఈ క్యాంట‌న్ల‌ను గత ఏడాది ఆగస్టు నెలలో తెలుగుదేశం ప్రభుత్వం   ప్రారంభించిన విష‌యం విదిత‌మే. వీటిలో భోజనంతోపాటు ఉదయం టిఫిన్‌ రూ.5 కే అందించే వారు. అయితే ప్ర‌భుత్వం మారాక వీటి నిర్వ‌హ‌ణ‌పై సంస‌యం నెల‌కొన్న నేప‌థ్యంలె ముందుగా  వీటి రంగు మార్చాలంటూ  రాష్ట్రస్థాయి అధికారులు ఆదేశాలు ఇవ్వ‌టంతో వీటి కొన‌సాగింపు ఖాయ‌మైంది. దీంతో ఈ భవనాలపై వైట్‌వాష్   వేస్తున్నారు.  త‌దుప‌రివైసిపి జండా రంగుల‌ను వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.   తర్వాత పేరు మార్పిడి, ఇతర విధి విధానాలను ప్రభ్వుతం ఖరారు చేస్తుందని, అన్నింటికీ సిద్ద‌మై ఉండాల‌ని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా   నిధుల దుర్వినియోగం అరిక‌డ‌తామంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న ప్ర‌భుత్వం క్యాంటీన్‌లు ప్రారంభమై ఏడాది కాకముందే మ‌ళ్లీ రంగు మార్చడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిన‌ట్టు కాదేమో వారికి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.