వైసిపి వాళ్లు వేధిస్తున్నార‌ని ఆశా వర్కర్‌ ఆత్మహత్యాయత్నం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 12:19 AM
 

పెరిగిన జీతాలు త‌క్ష‌ణ‌మే ఇవ్వాలంటూ ఓ వైపు ఆశా వ‌ర్క‌ర్లు రోడ్లెక్కుతుంటే, మ‌రోవై పు వైసిపి కార్యకర్తలు తనను వేధిస్తున్నారంటూ..  ఆశా వర్కర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన  నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల‌లోకి వెళితే సంగం మండలం చెన్నవరపాడు కు చెందిన వెంకట రమణమ్మ అనే ఆశావర్కర్‌ సోమ‌వారం నిద్రమాత్రలు మింగింది.   త‌న కార్యాల‌యంలో చ‌ల‌నంలేకుండా ప‌డి ఉన్న ఆమెను  గమనించిన స్థానికులు వెంటనే 108 లో  సంగం మండ‌ల ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ నుంచి జిల్లా కేంద్ర ఆసుప‌త్రికి తీసుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఆమె కు చికిత్స జ‌రుగుతోంద‌ని, పూర్తిగా కోలుకున్నాక పంపిస్తామ‌ని వైద్యులు చెప్పారు. కాగా ఈ విష‌య‌మై త‌గిన స‌మాచారం కోసం చూస్తున్న‌ట్టు పోలీసులు చెపుతున్నారు.


 ఈ నెల 13వ తేదీన మ‌చిలీ ప‌ట్నంలో ఓ ఆశావ‌ర్క‌ర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌న‌ట జ‌ర‌గ‌టం ఆందోళ‌న క‌లిగించేదే.