గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు జ‌గ‌న్ ఆత్మీయ వీడ్కోలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 12:10 AM
 

గ‌త 12 ఏళ్లుగా ఏపి రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లందించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ని అన్ని వేళ‌లా  భ‌గ‌వంతుడు ఆశీర్వ‌దిస్తాడ‌ని అన్నారు ఎసి సిఎం జ‌గ‌న్‌.  ఇన్నాళ్లు ఉమ్మ‌డిగా తెలుగురాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన న‌ర‌సింహ‌న్‌ను తెలంగాణ‌కు ప‌రిమితం చేసి ఏపికి కొత్త‌గ‌వ‌ర్న‌ర్ ని నియ‌మించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆత్మీయ వీడ్కోలు స‌భ అమ‌రావ‌తిలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గవర్నర్‌ నరసింహన్‌, విమలా నరసింహన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతిలు సత్కరించి, జ్ఞాపికను అందజేసారు.