మ‌రింత మంది బిజెపిలో చేరాలి : క‌న్నా పిలుపు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 12:04 AM
 

2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఏపిలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బిజెపి  ఎవ‌రు వ‌చ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఆషాడ మాసం వల్ల కొంత వరకు చేరికలు ఆగినా, విజ‌య‌వాడ‌కు చెందిన  మైనారిటీ నాయకుడు షేక్ ఖాజా అలి తోస‌హా మరో 300మంది కార్యకర్తలు సోమ‌వారం బిజెపిలో చేరారు. వీరిని  బిజెపి ఎపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకండువాకప్పిసాదరంగాఆహ్వానించారు. 


ఈసంద‌ర్భంగా క‌న్నా మాట్లాడుతూ  ఢిల్లీ నుంచి గల్లి వరకు చేరికలు ఉండ‌బోతున్నాయ‌ని చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి ఏ ప్రాంతానికి తాను వెళ్లినా ఎపి లో టిడిపి, జనసేన, వైసిపి నుంచి నేత‌లు బాగా చేరుతున్నారని, ఇప్ప‌టికే.మైనారిటీ లు, దళితుల నుంచి చేరికలు  పెరిగాయ‌ని అన్నారు.  బిజెపి సభ్యత్వ నమోదు ఆగష్టు11 వరకు‌ సాగుతుంది.అన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంకా సభ్యులు గా చేరాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.