అమ్మ ఒడి స‌రే.... ఉపాధ్యాయులేరీ?

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 11:53 PM
 

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి విద్య సదుపాయాలు కల్పించాలని దానికోసం ప్రాధమిక పాఠశాలల్లో సైతం భాషా పండితులను నియమించాలని జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొణతాల సీతారామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాలో మాట్లాడితూ, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని చూస్తున్న ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌళిక స‌దుపాయాలు, ఉపాధ్యాయులు స‌హేతుకంగా ఉన్నాయో లేదో చూడాల‌న్నారు. 


ఒకటోతరగతి నుంచే తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలపై కార్పోరేట్ పాఠశాలల్లో భోదన జరగడం వలనే నిరుపేద తల్లిదండ్రులు సైతం వేలకి వేలు ఫీజుల రూపంలో ప్రైవేటు పాఠశాలలకు ఖర్చు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదని అన్నారు. ప్రభుత్వ హయాంలో నడిచే ప్రాధమిక పాఠశాలల్లో భాషా పండితులను నియమిస్తే అదే విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనూ దొరుకుతుందనే భావన ప్రజల్లో కలుగుతుందని స్పష్టం చేశారు