కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠం నాకు ఇవ్వండి - యువ ఇంజ‌నీర్ ప్ర‌క‌ట‌న‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 11:17 PM
 

కాంగ్రెస్ ప‌క్ఆలు నాకివ్వండి....  కాంగ్రెస్ దశ, దిశలను మారుస్తానంటున్నాడు ఓ ఇంజినీర్.  రాజ‌కీయ ఘ‌నాపాటీలు సైతం వ‌ద్ద‌నుకుంటున్న కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం జూలై 23న అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకుంటా." అని చెబుతున్నాడు పూణేకు చెందిన   గజానంద్ హోసలే. అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే  రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది.  ఆయ‌న‌ అస్త్ర సన్యాసం చేసి చాలా రోజులైనా కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేక పోవ‌టంతో  పార్టీని నడిపించే నాయకుడు ఎవ‌రో తెలియ‌క కార్యకర్తలు నైరాశ్యంలో పడిపోతున్నారన్న‌దీ వాస్త‌వం.  దీంతో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ చూసుకుంటూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి, క‌మ‌లం చెంత‌కు చేరేసారు. 


 ఇలాంటి ప‌రిస్థితిలో తనకు అధ్యక్షుడిగా ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుని, ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలననే నమ్మకం నాకుందని చెప్పాడు  గజానంద్..  ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే ఒక కంపెనీలో మెనేజర్‌గా పనిచేస్తున్న గ‌జానంద్ కాంగ్రెస్‌కు వీరాభిమాని,  నాకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు. అయితే నేను కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభిస్తే..ఎప్పటికీ కార్యకర్తగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ కొత్త దారిని ఎంచుకున్నాను. మొదట పార్టీ సభ్యత్వం తీసుకున్న తరువాత  అధ్య‌క్ష స్థానం కోసం నామినేష‌న్‌వేస్తా అని చెప్పాడు.   "కాంగ్రెస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనేది ఇంకా తేలలేదు. అయితే..కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమని స్వయంగా రాహుల్ చెప్పడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.   ఒక సామాన్యుడిగానే మా గ్రామంలోని సమస్యలపై ఇప్పటివరకూ పోరాడాను. అధికారుల సహాయంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఇలాగే అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఇందుకోసం తాను ఒక బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నానని చెబుతున్నాడు.