అన్నమయ్య కీర్తనలకు 'శోభ'నిచ్చారు! -టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 10:01 PM
 

నాడు శ్రీవారి భక్తిని అనమ్మయ్య సంకీర్తనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. నేడు అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామి వారి గొప్పదనాన్ని శోభరాజ్‌ విశ్వవ్యాప్తం చేశారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ సమీపంలోని అన్నమయ్యపురంలో శనివారం సాయంత్రం శోభరాజ్‌ అన్నమయ్య కీర్తనల కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అన్నమయ్య భావనావాహిని ఏర్పాటు చేసి వేల మంది శిష్యులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అన్నమయ్య సందేశాలను పరిపుష్టం చేస్తున్నందుకు ఆయన అభినందించారు. దశాబ్దాల తరబడి ఆమె చేస్తున్న సేవలకు శ్రీవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. భవిష్యత్తులో అన్నమయ్య కీర్తనలు ప్రతీ కుటుంబంలో నిత్యం మారుమోగే స్థాయికి తీసుకెళ్లాలని శోభరాజ్‌కు సూచించారు. భవిష్యత్తు లో శోభరాజ్ కృషికి టీటీడీ నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సుబ్బారెడ్డి హామీనిచ్చారు.