ఖ‌తార్ లో సైమా వేడుకలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 09:29 PM
 

సైమా ఎనిమిదవ ఎడిషన్‌ అవార్డుల వేడుకలు ఆగస్ట్‌ 15-16వ తేదీల్లో ఖతార్‌లో జరుగనున్నాయి. సైమా వేడుకలకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వాహకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విష్టు ఇందూరి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సైమా అవార్డులు మరింత కన్నుల పండవగా జరుగనున్నాయి. సినిమాలతో పాటు లఘు చిత్రాల రూపకర్తల్లోని ప్రతిభను వెలికితీయడానికి షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డులను ప్రవేశపెట్టాం అని తెలిపారు. ఈ సమావేశంలో కథానాయికలు శ్రియ, నిధి అగర్వాల్‌, రుహాని శర్మ, శాన్వి శ్రీ వాస్తవ, అస్మిత నర్వాల్‌ తమ అందాలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో తెలుగు చిత్రసీమ నుంచి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం 12 నామినేషన్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహానటి (తొమ్మిది నామినేషన్స్‌), గీతగోవిందం (ఎనిమిది నామినేషన్స్‌), అరవింద సమతే (6 నామినేషన్స్‌) నిలిచాయి.