పాకిస్థాన్‌ ప్రధానికి అమెరికా గడ్డపై ఘోర పరాభవం

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 09:18 PM
 

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అమెరికా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన ఆయనను స్వాగతించేందుకు పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ, పలువురు పాకిస్థానీ అమెరికన్లు మాత్రమే వచ్చారు తప్ప అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. విమానాశ్రయం వద్దకు ఒక ప్రోటోకాల్‌ అధికారి మాత్రమే వచ్చారు. ఖాతార్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో అమెరికా వచ్చిన ఇమ్రాన్‌.. తమ రాయబారి అసద్‌ మజీద్‌ఖాన్‌ అధికారిక నివాసంలోనే బసచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఖాన్‌ సమావేశం కానున్నారు.