ఏపీ సీఎం జగన్‌కు సారీ చెప్పిన గవర్నర్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 08:58 PM
 

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్.. ఏపీ సీఎం జగన్‌కు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సారీ చెప్పారు. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు కావడంతో.. విజయవాడలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌‌కు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ నరసింహన్.. తొమ్మిదిన్నరేళ్లపాటు ఇరు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలిసో.. తెలియక తప్పులు చేసి ఉండవచ్చని.. అందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సీఎం.. నన్ను క్షమించాలని.. సభా వేదికగా క్షమాపణలు కోరారు. తన కారణంగా నొచ్చుకున్న అందరికీ సారీ అంటూ.. భావోద్వేగానికి గుర్యారు. ఏపీ ప్రజలు తన మీద చూపిన ప్రేమను మర్చిపోలేనని గవర్నర్ పేర్కొన్నారు.