విజయవంతంగా భూకక్ష్యలోకి చంద్రయాన్‌2 : శివన్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 03:15 PM
 

భూకక్ష్యలోకి చంద్రయాన్‌2ను విజయవంతంగా ప్రవేశపెట్టామని ఇస్రో డైరెక్టర్‌ శివన్‌ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి ఇస్రో సిబ్బంది కృషి కారణమన్నారు. రాకెట్‌లో సాంకేతిక లోపం కనుగొని ప్రయోగాన్ని నిలిపివేసిన తరువాత ఇస్రో సిబ్బంది మొత్తం తమ రాత్రింబవళ్లూ ఇక్కడే ఉండి దానిని సరిచేశారని ఆయన చెప్పారు. గత ఏడాదిన్నరగా తమ సిబ్బంది దీనికోసం కృషి చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు. చంద్రయాన్‌ 2తో ప్రపంచానికి మన సత్తా చాటామని ఆయన చెప్పారు.