రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం : తులసిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 01:12 PM
 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని, వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ 50 రోజుల పాలనలో 39 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను మంత్రులు పరామర్శించలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర పథకంతో సంబంధం లేకుండా… రూ. 12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎం జగన్ మాట మార్చారని తులసిరెడ్డి ఆరోపించారు. కేంద్ర పథకంతో సంబంధం లేకుండా రైతులకు రూ. 12,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.