తిరుమల ఎల్‌1,ఎల్‌2,ఎల్‌3 దర్శనాల రద్దుపై నేడు హైకోర్టు తీర్పు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 12:06 PM
 

తిరుమల ఎల్‌1,ఎల్‌2,ఎల్‌3 దర్శనాల రద్దుపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. టీటీడీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ను హైకోర్టు గత విచారణపై వివరణ కోరింది. ప్రభుత్వం ఇచ్చే కౌంటర్‌పై విచారణ చేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో బ్రేక్‌ దర్శనాలు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే టీటీడీ ఎల్‌1, ఎల్‌2 దర్శనాలకు బదులు ప్రోటోకాల్‌ దర్శనాలను అనుమతిస్తున్నది. ప్రోటోకాల్‌ దర్శనంలో 40 మంది వీఐపీలకు టీటీడీ అవకాశం ఇచ్చింది.