చంద్రయాన్-2 రాకెట్ నేడు అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది. చంద్రయాన్ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ఆదివారం సాయంత్రం 6 గంటల 43 నిముషాలకు ప్రారంభమైంది. నేటి మధ్యాహ్నం 2 గంటల 43 నిముషాలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనున్నది. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 (జిఎస్ఎల్వి ఎంకె 3) లో యుహెచ్25 ఇంధనాన్ని నింపడం జరిగిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ నెల 15వ తేదీన రాకెట్లో సాంకేతిక లోపం గుర్తించిన శాస్త్రవేత్తలు దాని ప్రయోగాన్ని నిలిపివేశారు. లోపాలను సరిదిద్దిన తరువాత నేడు ప్రయోగించనున్నారు.