రూ.5లక్షల్లోపు ఆదాయమున్న అందరికీ ఆరోగ్య శ్రీ : ఆళ్ల నాని

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 12:56 PM
 

రూ.5లక్షల లోపు వార్షిక ఆదాయమున్న వారందరికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆరోగ్య శ్రీ అమలుపై శాసనమండలిలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ… ఆరోగ్య శ్రీ నిబంధనలు సడలించి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. సుజాతరావు కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామన్నారు.