ఏ రోజు పాలన సజావుగా సాగనివ్వలేదు : కుమారస్వామి

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 11:52 AM
 

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఏ రోజు పాలన సజావుగా సాగనివ్వలేదని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. సభలో మాట్లాడుతున్న ఆయన గత 14 నెలలుగా రాష్ట్రంలో అధికారంలో జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతూనే ఉందని కుమారస్వామి చెప్పారు. బీజేపీ నాయకుల ధోరణి చూస్తుంటే ఎప్పుడెప్పుడు సభలో విశ్వాసరీక్స జరుగుతుందా అని ఎదురు చేస్తున్నట్లుగా ఉందని సీఎ కుమారస్వామి ఉన్నారు. వారికి అధికార దాహం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.