పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు : మల్లాది విష్ణు

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 11:36 AM
 

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సభను పోలవరం పేరుతో టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ క్లియర్ గా వివరణ ఇచ్చారన్నారు.