పోలవరం పనులు ఆపలేదు : మంత్రి అనిల్

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 09:39 AM
 

పోలవరం పనులు ఆపేశామనడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించిన టీడీపీకి సమాధానంగా ఆయన మాట్లాడుతూ…. పోలవరంపై సీఎం సమీక్ష జరిపారన్నారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదన్నారు. 2021 వరకు సమయం పడుతుందని అధికారులు చెప్పారన్నారు. ప్రాజెక్టపై ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.