నేటి మధ్యాహ్నం కుమారస్వామి విశ్వాస పరీక్ష

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 09:38 AM
 

బెంగళూరు :  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేటి మధ్యాహ్నం శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. గురువారంనాడు విశ్వాసపరీక్షపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార జెడిఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభ వాయిదా పడిన అనంతరం రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నారు.