రానున్న మూడ్రోజులో తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 08:29 AM
 

ఈరోజు ఏపీలో కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో కొన్ని చోట్ల మోస్తరు జల్లులు నుండి భారీ వర్షం కురిసింది. కాగా మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని, తెలంగాణలో కూడా రేపటి నుండి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య పశ్చిమ బంగాళాఖాతం, దక్షణ ఒడిశా తీరప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని.. ఈనెల 22 వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.