ప్రవాస భారతీయుడు భారీ విరాళం

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 02:58 PM
 

తిరుమల శ్రీవారికి గుంటూరు జిల్లా తెనాలి కూచిపూడి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జాస్తి సాంబశివరావు దంపతులు రూ.కోటి విరాళాన్ని సమర్పించారు. సాంబశివరావు వృతిరీత్యా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో స్థిరపడ్డారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. విరాళం మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా వచ్చే నాలుగేళ్లలో ఏటా రూ.కోటి చొప్పున ఒక్కో పథకానికి విరాళంగా అందజేస్తామని దాత ప్రకటించారు.