గవర్నర్ కార్యదర్శిగా ముఖేష్ మీనా

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 02:55 PM
 

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనా నియ‌మితుల‌య్యారు.  ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయ‌న ఇక‌పై పూర్తి అదనపు బాధ్యతలతో గవర్నర్ కార్యదర్శిగా  ప‌నిచేయ‌నున్న‌ట్టు రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు చెపుతున్నాయి. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తొలి గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ ఈ నెల 24న  ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో  మీనా   రాజ్ భవన్ పనులను  సైతం ప‌ర్య‌వేక్షించేందుకు అప్పుడే విజ‌య‌వాడ చేరుకుని భ‌వ‌నాల‌ను ప‌రిశీలిస్తున్నారు.  భ‌వ‌నాల ఎంపిక ఈ రోజే పూర్తి చేసి తుదిమెరుగుల‌కు ఆదేశాలిచ్చే ఆస్కారం ఉంద‌ని స‌మాచారం.