మూడో స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్!

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 12:20 PM
 

ప్రపంచ కుబేరుల జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ ఇండెక్స్ లో బిల్ గేట్స్ ఒక స్థానం దిగజారారు. అత్యంత ధనవంతుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కొనసాగగా, రెండో స్థానంలోని బిల్ గేట్స్ కు షాకిస్తూ, ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. గేట్స్ ఆస్తి ప్రస్తుతం 107 బిలియన్ డాలర్లు కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 108 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఉన్నారని బ్లూంబర్గ్ తెలిపింది. కాగా, తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, భారీగా భరణం చెల్లించినా బెజోస్ 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఉన్నారు. ఆయన భార్య 40.3 బిలియన్ డాలర్లతో మహిళా ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో, మొత్తం మీద 22వ స్థానంలో ఉన్నారు. గేట్స్ తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ కు విరాళం ఇవ్వగా ఆయన ఆస్తి తగ్గిపోయింది. ఇక ఈ సంవత్సరం అత్యధికంగా సంపదను పెంచుకున్న వారిలోనూ ఆర్నాల్ట్ తొలి స్థానంలో ఉన్నారు.