రవిశాస్త్రి ప్లేస్‌ను భర్తీ చేయడానికి రేస్‌లో హేమాహేమీలు!

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 08:28 PM
 

ప్రపంచకప్ 2019లో భారత్ సెమీఫైనల్‌తో ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమ్ డొల్లతనం మరోసారి బయటపడింది. దీనితో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వయసుతో పాటు కొత్త నిబంధనలను కూడా బోర్డు దరఖాస్తులో జత చేసింది.
కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.
ఇక ఆసక్తి కలిగిన అభ్యర్దులు తమ దరఖాస్తులను జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా అందజేయాలని బీసీసీఐ తెలియజేసింది. అటు కోచింగ్ బృందంగా వ్యవహరిస్తున్న సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ప్లేస్‌ను భర్తీ చేయడానికి హేమాహేమీలు రేస్‌లో ఉన్న వారిలో టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్ , ట్రెవర్ బేలిస్, మహేలా జయవర్దనే , అనిల్ కుంబ్లే , సౌరవ్ గంగూలీ .