అది నా క్యాంపు కార్యాల‌యం కాదు... స‌మాచార కేంద్రం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 06:44 PM
 

తిరుమ‌ల తిరుప‌తికి సంబంధించి స‌మాచార కేంద్రాలు చెన్నై, బెంగుళూరు, న్యూ ఢిల్లీ, ముంబాయి త‌దిత‌ర ప‌ట్ట‌ణాల‌లో  ఏర్పాటు చేసిన విధంగానే న‌వ్యాంధ్ర నూత‌న రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయ‌వ‌ల‌సిందిగా ఆల‌య చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి  అధికారులకు ఆదేశాలిచ్చారు.  ఇప్ప‌టికే టిటిడి కార్యాల‌యం విజ‌య‌వాడ‌లో ఉంద‌ని, అయితే అమ‌రావ‌తిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నందున ఇక్క‌డ కూడా ఓ స‌మాచార కేంద్రం ఉండ‌టం అవ‌స‌ర‌మ‌ని భావించే దీనిని ఏర్పాటు చేయాలని చూస్తున్న‌ట్టు తెలిపారు. ఇదివ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌రాష్ట్ర‌ రాజ‌ధాని హైద‌రాబాదులో టిటిడి కార్యాల‌యం, స‌మాచార‌కేంద్రం ఉన్నవిష‌యాన్ని ఆయ‌న గుర్తు చేస్తు, ఆంధ్రుల రాజ‌ధాని అయిన‌ అమ‌రావ‌తిలో కార్యాల‌య  ఏర్పాటు చేయాల‌న్న‌దే త‌న త‌ప‌న అన్నారు. అయితే త‌ను ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయ‌వ‌ల‌సిందిగా  ఆదేశాలిచ్చిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు వాస్త‌వం కాద‌ని స్ప‌ష్టం చేసారు సుబ్బా రెడ్డి.