శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 06:04 PM
 

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ అద‌న‌పు కమిషనర్‌ శ్రీమతి అపూర్వ వ‌ర్మ‌, జాయింట్‌ కమిషనర్‌  జయరామన్‌లు కలిసి సమర్పించారు.


బుధ‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి,   చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో   అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి  ధ‌ర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.