సీపీ చెప్పే రేట్లకు కరెంట్ ఎక్కడా రాదు : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 05:37 PM
 

అసత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగా కరెంట్ ఎక్కడా దొరకదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఐదేళ్ల ముందు భారీగా కరెంట్ కోతలుండేవని.. ఇప్పుడు మిగులు విద్యుత్ సాధించామన్నారు. వినూత్న కార్యక్రమాలతో పవర్ సెక్టార్ ను అభివృద్ధి చేశామని, కార్యనిర్వాహక వ్యవస్థలో జ్యుడిషియల్ జోక్యం ఉండదని, పీపీఏలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. పునురుత్పాదక లెక్కలపై అసత్య ప్రచారం చేసి ఏదో నమ్మించాలని ప్రభుత్వం చూస్తుందన్న చంద్రబాబు పోలికచేసేటపుడు అన్ని విషయాలను తెలుసుకోవాలని, సాంకేతిక విషయాలు చెబుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.