ఇ.డి. పిటిషన్‌కు సమాధానమివ్వడానికి గడువు కోరిన వాద్రా

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 03:42 PM
 

మనీ ల్యాండరింగ్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానమివ్వడానికి గడువు కావాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఢిల్లి హైకోర్టును కోరారు. ఇ.డి. దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని హైకోర్టు వాద్రాను ఆదేశించగా ఆయన గడువు కోరారు. వాద్రాకు జస్టిస్‌ చందర్‌శేఖర్‌ రెండు వారాల గడువు మంజూరు చేశారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 26కు వాయిదా వేశారు. కోర్టు నోటీసు జారీ చేసిన సమయంలో వాద్రా దేశంలో లేరని, జూలై 11న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారని వాద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.