చిత్తూ‌రులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:24 PM
 

    చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో ఓ టెంపో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మృతిచెందారు. తెల్లవారుజామున 3 గంటలకు ముళబాగల్ నుంచి గుడియాత్తంకు కట్టెల లోడుతో టెంపో బయల్దేరింది. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారు గుడియాత్తంకు చెందిన పరందామ, శివలుగా గుర్తించారు.