బిజెపి నేతలు కొందరు విప్ చెల్లదని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత డికె శివకుమార్ అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీకి ఉందని ఆయన చెప్పారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి మరింత బలాన్నిచేకూర్చిందని ఆయన అన్నారు.