అన్నప్రసాద వితరణ పునః ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:42 PM
 

చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా మూత ప‌డిన అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కేంద్రాల‌ను తిరిగి ఆరంభినట్టు టిటిడి తెలిపింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ, తిరుప‌తిలోని వెంగ‌మాంబ అన్న‌దాన కేంద్రంతొ పాటు, తిరుపతిలోని టిటిడి ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, 1, 2, 3వ సత్రాలు, ఆసుపత్రులు, తిరుచానూరులోని అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బుధ‌వారం ఉదయం శుద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అనంత‌రం యధావిధిగా అన్నప్రసాద వితరణ జ‌రుగుతోంద‌నివివ‌రించింది.