కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై మండలిలో వాడివేడి చర్చ

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:42 PM
 

కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. చంద్రబాబుపై కక్ష సాధిస్తూ కరకట్టపై అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో అనుమతులు ఎలా ఇచ్చారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కరకట్టపై 26 అక్రమ నిర్మాణాలు గర్తించామని పేర్కొన్నారు. నది వెంబడి ప్రజావేదిక కట్టకూడదని నిబంధనలు ఉన్నా చంద్రబాబు తుంగలో తొక్కారని బొత్స చెప్పారు. ప్రజావేదికకు అనుమతులిచ్చిన అధికారుల నుంచే రూ.8 కోట్లు వసూలు చేస్తామన్నారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని, లింగమనేని రమేశ్‌తో పాటు అద్దెకుంటున్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయడం మంచిదని, లేకుంటే చట్టం తనపని తాను చేస్తుంది, కూల్చడం ఖాయమన్నారు.