కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 12:32 PM
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఫోన్ చేశారు. ఏపీ కొత్త గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా సీఎం జగన్ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టాభివృద్ధికి సంపూర్ణ సహాయ, సహకారాలు అందించాలని గవర్నర్‌ను జగన్ కోరారు.  రాష్ట్ర విభజన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఒడిశా బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి విశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ గవర్నర్‌గా.. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమిస్తూ మంగ‌ళ‌వారం ఉత్తర్వు లు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజనకు ముందు 2009, డిసెంబర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఈఎస్‌ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఇప్పటివరకు ఆయనే రెండు తెలుగు రాష్ర్టాల గవర్నర్‌గా కొనసాగుతున్నారు.