గంగవరాన్ని వెంటాడుతోన్న చిరుత భయం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 12:08 PM
 

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గంగవరం అటవీ ప్రాంతంలో గ్రామస్తులను చిరుతపులి భయం వెంటాడుతోంది. దీని విషయమై గ్రామస్తులంతా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గంగవరం గ్రామ ప్రజలు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో పాడి గేదెలు అరుస్తున్నాయని.. ఏమైందో చూసేందుకు ఆ పాడి గేదెల యజమానులు వెళ్లి చూస్తుంటే.. యజమానుల అలికిడితో ఏదో ఒక జంతువు పారిపోతుందని చెబుతున్నారు. అది ఏ జంతువు అనే విషయం తెలియదని, చిరుతపులి అయి ఉండవచ్చని గ్రామస్తులు భయాందోళన వ్యక్తపరిచారు. అధికారులు వచ్చి దాన్ని పట్టుకొని నిర్ధారించవలసి ఉంది.