అసెంబ్లీలో కూర్చొనే స్థానాలపైనా వెటకారం చేస్తారా?: చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:26 AM
 

ఏపీ అసెంబ్లిలో సీట్ల కేటాయింపుపై రగడ జరిగింది. సీట్ల కేటాయింపుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లిలో కూర్చొనే స్థానాలపైనా వెటకారం చేస్తారా? అని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. సభకు సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని అందరూ పాటించాలన్నారు. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని చంద్రబాబు కోరారు.