మండలికి మంత్రులు సకాలంలో రాక పోవడంపై ఎమ్మెల్సీల అసంతృప్తి

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:05 AM
 

అమరావతి:  మండలి లాబీలో ఎమ్మెల్సీలు చిట్‌చాట్‌ చేస్తున్నారు. శాసన మండలికి మంత్రులు సకాలంలో రాక పోవడంపై ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు సకాలంలో రాక పోవడంతో ప్రశ్నలు వాయిదా పడుతున్నాయంటూ పేర్కొంటున్నారు. పెద్దల సభను పట్టించుకోకపోతే ఎలా అంటూ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తున్నారు. మంత్రుల తీరును సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ ఎమ్మెల్సీలు పేర్కొంటున్నారు.