పద్దతి ప్రకారమే సీట్ల కేటాయింపులు: సీఎం జగన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 10:55 AM
 

అమరావతి: ఏపీ అసెంబ్లిలో సీట్ల కేటాయింపుపై రగడ జరిగింది. సీట్ల కేటాయింపుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. స్పందించిన సీఎం జగన్‌ … సీట్ల కేటాయింపులు పద్దతి ప్రకారమే జరిగాయని అన్నారు. స్పీకర్‌కు రూల్స్‌ మీరే చెబుతున్నారని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్నిసార్లు ఎమ్మెల్యేలైనా ఇవే రూల్స్‌ పాటించాలన్నారు. సీట్ల కేటాయింపునకు ఓ పద్దతి ఉండాలన్నారు. గతంలో ఉన్నప్పుడు మీరెలా ప్రవర్తించారు? అని జగన్‌ ప్రశ్నించారు.