చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే పనికొచ్చింది!: ఏపీ మంత్రి అనిల్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 10:42 AM
 

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జలవనరుల శాఖలో తీవ్రస్థాయిలో అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. ఆయన అనుభవం దోచుకోవడానికే పనిచేసిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడారు.  ఏపీలోని పలు సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.16,000 కోట్ల మేర రేట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత శిలాఫలకాలకు ఖర్చు చేశారే తప్ప ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న ధ్యాస ఆయనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఎక్కడాలేని విధంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిని తెస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టుల్లో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషనర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.