ప్రజా సమస్యలు వదిలి కక్షసాధింపులపై శ్రద్ధ పెట్టిన వైసీపీ: చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 09:28 AM
 

అమరావతి:  ప్రజల సమస్యలు వదిలేసి వైసీపీ కక్ష సాధింపులపై శ్రద్ధ పెట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. అన్ని వర్గాల సమస్యలు సభలో వినిపించాలని సభ్యులకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.