బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద 80 కిలోల గంజాయి పట్టివేత

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 08:54 AM
 

ప్రకాశం జిల్లా మార్టూరు శివారు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఎన్‌.తిరుపతయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ సహా 9 మందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో రాత్రి నుంచి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది నిఘా వేసి పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న మరికొందరి కోసం సోదాలు కొనసాగుతున్నాయి.