వైభ‌వంగా శాకంబ‌రీ ఉత్స‌వాలు - పాల్గొన్న న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:02 PM
 

 విజ‌య‌వాడ‌లో ఇంద్ర‌కీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇంద్రకీలాద్రి శాకంబరీ దేవి ఉత్సవాలు రెండవ రోజు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప్రముఖ తెలుగు సినీ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ శ్రీ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.  దర్శనానంతరము రాజేంద్ర ప్రసాద్  వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి లయ అధికారులు అమ్మవారి ప్రసాదము, చిత్రపటమును అందజేసారు. శాకాంబ‌రి ఉత్స‌వాల సంద‌ర్భంగా మ‌హిళ‌లు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. ప‌సుపు కుంకాల‌తో పాటు నెత్తిన ఘ‌టాలు పెట్టుకుని అమ్మ‌వారి మొక్కుబ‌డులు తీర్చుకున్నారు.